ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాసనమండలిలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 15న తొలి పబ్లిక్ నోటీసు, అక్టోబర్ 25న రెండో పబ్లిక్ నోటీసు ప్రచురించనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్లుగా నమోదుకు ఫారం19 ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు నవంబర్ 6ను చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితాపై నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 25న క్లైయిమ్స్ అభ్యంతరాల పరిష్కారం, అనుబంధ జాబితా తయారీ, ముద్రణ పూర్తి చేయాలి. అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాకు షెడ్యూల్
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)