న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనారోగ్యానికి గురవ్వడంతో కర్నాటక, మహారాష్ట్రలో అధికారిక కార్యక్రమాలు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ఆయన కర్నాటకలోని హుబ్బళ్లిలో రూ.700 కోట్లతో నిర్మించిన కేఎల్‌ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసావిరమఠ్ మెడికల్ కళాశాల నూతన భవనంతోపాటు, 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో, శుక్రవారం రాత్రే ఆయన హుబ్బళ్లిలోని హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో డాక్టర్ల సూచన మేరకు కార్యక్రమానికి హాజరుకాకుండా హోటల్‌లోనే ఉండిపోయారు. అమిత్ షా గైర్హాజరైన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్నాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ సిఎం బసవరాజ్ బొమ్మై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కేఎల్‌సీ సొసైటీ ఛైర్మన్, రాజ్యసభ మాజీ ఎంపీ ప్రభాకర్ కోరే మాట్లాడుతూ ... ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అమిత్ షా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ఆరోగ్య కారణాల రీత్యా దూరంగా ఉన్నారని వెల్లడించారు. ఇక ... వైద్యుల సూచన మేరకు విశ్రాంతి కోసం అమిత్ షా హుబ్బిళ్లి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొల్హాపూర్ పర్యటన కూడా రద్దు చేశారు.
అమిత్ షా కు అస్వస్థత - అధికారిక కార్యక్రమాలు రద్దు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)