గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టిడిపి సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

1 గంట క్రితం

satrucharla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : టిడిపి సీనియర్‌ నేత,మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సంస్థానాధీశంలో శత్రుచర్ల విజయరామరాజు 1948 ఆగస్టు 4న జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ఆయన, ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితులు. శత్రుచర్ల విజయరామ రాజు తన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్వతీపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1978లో జనతా పార్టీ తరపున నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, అనంతరం కాంగ్రెస్, టిడిపిల్లో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా, రోశయ్య కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2017లో టిడిపి తరఫున శ్రీకాకుళం స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 2023 వరకు కొనసాగారు. శత్రుచర్ల విజయరామరాజు భార్య రాణి శశికళాదేవి. శత్రుచర్ల విజయరామరాజు మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్