దేవదుర్గ మైనింగ్ బ్లాక్‌ను సందర్శించిన భట్టి విక్రమార్క
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : సింగరేణి సంస్థ తొలిసారి బంగారం వెలికితీయనుంది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా లింగదహళ్లిలోని దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ బ్లాకును ఇటీవల నిర్వహించిన వేలంలో దక్కించుకుంది. ఈ బ్లాక్‌ను గురువారం సింగరేణి అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ బ్లాక్ నుంచి సింగరేణి అధికారులు సేకరించిన వివిధ ఖనిజ నమూనాల ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. బంగారం, రాగి అన్వేషణ గురించి సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బంగారం, రాగి ఖనిజ అన్వేషణకు సహకరించాలని స్థానిక ప్రజాప్రతినిధులను భట్టి కోరారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర అధికార యంత్రాంగంతో సమావేశమై ఖనిజ అన్వేషణపై దిశ నిర్దేశం చేశారు.







కామెంట్‌లు (0)