mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు కంపెనీలపై కలెక్టర్ పి.రాజాబాబు తీవ్ర ఆగ్రహం..

2 గంటల క్రితం

todaco
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 10:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక

  • ఒంగోలు పొగాకు వేలం కేంద్రాల అకస్మిక తనిఖీ

ప్రజాశక్తి-ఒంగోలు ప్రతినిధి: పొగాకు కొనుగోలులో కంపెనీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తిరస్కరణలను వెంటనే తగ్గించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు స్పష్టం చేశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత కూడా కొనుగోలుదారుల ధోరణిలో మార్పు రాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాలను శనివారం ఆయన అకస్మాత్తుగా సందర్శించి, కొనుగోలు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం కేంద్రంలో కంపెనీల ప్రతినిధుల ప్రవర్తనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టేలా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే సహించేది లేదని, అలాంటి కంపెనీల లైసెన్సులను తక్షణమే రద్దు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉందన్నారు. మరోవైపు, మార్కెట్ డిమాండ్, ధరల హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని పొగాకు సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తనిఖీల్లో పొగాకు బోర్డు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్