ప్రజాశక్తి - క్రోసూరు (పల్నాడు జిల్లా) : తల్లి మందలించిందని ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన లంకోటి ఆదిలక్ష్మి, రత్తయ్య దంపతులకు కుమారులు కోటేశ్వరరావు (25), సీతారామయ్య (24) ఉన్నారు. వీరిద్దరూ కూలి పనులకే వెళ్తుంటారు. సోమవారం రాత్రి కూరగాయలు తీసుకురావాలని వారికి ఆదిలక్ష్మి చెప్పారు. బయటకు వెళ్లిన అన్నదమ్ములు పది గంటలకు మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లి మందలించారు. దీంతో, మనస్థాపానికి గురైన కోటేశ్వరరావు 11 గంటలకు శీతలపానీయంలో పురుగుల మందు కలుపుకుని తాగారు. ఇది చూసిన సీతారామయ్య కూడా పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబీకులు వారిని సత్తెనపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి కోటేశ్వరరావు మృతి చెందారు. సీతారామయ్యను గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు తరలించగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. కోటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సీతారమయ్య అవివాహితుడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Print Editionతల్లి మందలించిందని కుమారులు ఆత్మహత్య
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)