ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 10 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టంలో నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా పురపాలక సంస్థల్లో ఎన్నికైన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా ఆరు నెలల గడువు పూర్తయ్యే వరకు, ఏది ముందైతే అది వర్తించేలా ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించారు. కందుకూరు, ఆమదాలవలస, నరసరావుపేట, పొన్నూరు, కావలి తాడిగడప పురపాలక సంఘాలు, చింతలపూడి, పొదిలి, అల్లూరు, బి.కొత్తకోట నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ నెల 30వ తేదీతో ముగియనున్న ప్రత్యేక అధికారుల పాలనను వచ్చే ఏడాది జనవరి 31 వరకూ లేదా ఎన్నికైన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే వరకు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని సిడిఎంఎ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక అధికారుల పాలన మరో 6 నెలలు పొడిగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)