శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Statewide protest - అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త నిరసనలు

1 గంట క్రితం

Statewide protest by Anganwadi workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం




anganwadeela protest


prakasam protest

ఒంగోలు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా

ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద వేలాది మంది అంగన్వాడీలు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ, రూ.26 వేల కనీస వేతనం, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను అమలు చేయాలని కోరారు. 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని నాయకులు విమర్శించారు. నవచైతన్య యాప్‌ను రద్దు చేయడం, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం, హెల్పర్ల ప్రమోషన్లలో సీనియారిటీ నిబంధన సవరణ, బకాయి టీఏ, ఇంటి అద్దె బిల్లుల చెల్లింపు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ... ఎపి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలంతా శుక్రవారం నిరసన నిర్వహించారు. గౌరవ వేతనం వద్దని, కనీస వేతనం కావాలంటూ నినాదాలు చేశారు.

ఏలూరు కలెక్టరేట్ వద్ద వేలాదిగా కదం తొక్కుతున్న అంగన్వాడి కార్యకర్తలు.... గౌరవ వేతనం వద్దని, కనీస వేతనం కావాలంటూ నినాదాలు.... పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ....

ఏలూరు కలెక్టరేట్ వద్ద వేలాదిగా కదం తొక్కుతున్న అంగన్వాడి కార్యకర్తలు.... గౌరవ వేతనం వద్దని, కనీస వేతనం కావాలంటూ నినాదాలు.... పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ....
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన అంగన్వాడీలు

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన అంగన్వాడీలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్