పొదిలి (ప్రకాశం) : 'గుక్కెడు మంచినీళ్లు వినిపించండి మహాప్రభో` అంటూ .... ఎస్సీ కాలనీవాసులంతా ఖాళీ బిందెలతో శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకారులు మాట్లాడుతూ .... పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత మూడు నెలలుగా తాగేనీరు, వాడుకునే నీరు విడుదల కాకపోవడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు తమ సమస్యలను తెలిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ... నిరసన చేపట్టామని తెలిపారు. తమకు మంచినీటి సమస్య తీర్చేంతవరకు రాస్తారోకో విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్సై సూరెడ్డి రాజేష్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో రాస్తారోకోను తాత్కాలికంగా విరమింప చేశారు.
గుక్కెడు మంచినీళ్లు వినిపించండి మహాప్రభో...
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)