గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో విషాదం.. టీచర్‌ దెబ్బలకు విద్యార్థి మృతి...!

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 05:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో విషాదం చోటు చేసుకుంది. వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ పాఠశాలలో విద్యార్థి ప్రణయ్ తేజ (6) మృతిచెందాడు. గురువారం ఉదయం స్కూలు కు వచ్చిన విద్యార్థి హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించారు. ఈ క్రమంలో చెంపపై కొట్టారు. కాసేపటికి విద్యార్ధి స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రణయ్ తేజ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై ప్రణయ్ తేజ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్