శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతులు, కౌలు రైతులను ఆదుకోండి

16 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఎంకు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసి పలు అంశాలపై రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాల్లో తాము పర్యటించామని తెలిపారు. ఎల్‌నినో కారణంగా తలెత్తిన కరువు పరిస్థితులను సాధారణ ప్రకృతి వైపరీత్యంగా కాకుండా అత్యవసర పరిస్థితిగా పరిగణించాలన్నారు. పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, పార్టీ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్