ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఉన్న సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. 2004 బ్యాచ్‌కు చెందిన కాంతి రాణా టాటా, 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని తక్షణమే సర్వీసులోకి పునరుద్ధరిస్తూ సాధారణ పరిపాలన శాఖ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తూ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. తాజాగా విధించిన సస్పెన్షన్ గడువు సెప్టెంబర్ 4తో ముగియనున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం వెలువడింది.
ఐపీఎస్‌లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాపై సస్పెన్షన్ ఎత్తివేత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 05:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)