శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రొటోకాల్ ఉల్లంఘనపై సిఎం చంద్రబాబు సీరియస్‌

03 సెప్టెంబర్, 2026

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 06:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవటం సరికాదన్నారు. వెలిగొండ, పోలవరం ఎల్ఎంసీ ప్రకటనల్లో మంత్రి రామానాయుడు ఫొటో లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. తప్పులు పునరావృతం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రారంభానికి జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో పని చేశాయన్నారు. రామానాయుడు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ పని బాగా చేశారంటూ అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్