బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యువకుడి అనుమానస్పద మృతి

1 గంట క్రితం

died
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆలమూరు(మడికి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని మడికి పరిధిలో ఓ నర్సిరిలో బుధవారం వేకువజాము యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మడికి శివారు గ్రామమైన చిలకలపాడుకు చెందిన మింగి రమేష్ (24) గా పోలీసులు గుర్తించారు. ఇది హత్య లేక మరి ఏదైనా జరిగిందా అనే కోణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తండ్రి శ్రీను తెలిపిన వివరాలు ప్రకారం ఎవరో ఫోన్ చేశారని తన కుమారుడు బైక్ మీద మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెళ్ళాడు. ఇంకా రాలేదని బుధవారం వేకువ జాము 1.30 గంటల సమయంలో తన కుమారుడు రమేష్ కు ఫోన్ చేశానని లిఫ్ట్ చేయలేదన్నారు. బుధవారం వేకువ జాము సుమారు 12.30 గంటల నుంచి 1.30 గంటల మధ్యలో మృతి చెంది ఉండవచ్చునన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్