సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇమ్రాన్‌ ఖాన్‌ పిటిషన్‌పై విచారణ నవంబర్‌ 7కి వాయిదా

1 గంట క్రితం

actor Imran Khan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 05:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ మేనల్లుడు, ఇమ్రాన్‌ఖాన్‌ పిటిషన్‌ను నవంబర్‌ 7కు బాంబే హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. ముందుగా విచారణ సందర్భంగా.. ఆయన క్ష‍మాపణలు చెప్పాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆయన క్ష‍మాపణలు చెప్పడంతో భారత్‌లో ఉండేందుకు అనుమతించింది. ఒసిఐ (ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డుదారులు ‘‘దేశం దయాదాక్షిణ్యాలపై" ఆధారపడి ఉంటారని, వారు భారత పౌరులతో సమానమైన హక్కులను కోరలేరని చీఫ్‌ జస్టిస్‌ మహేష్‌ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. భవిష్యత్తులో ఎటువంటి నిరసనల్లో లేదా ఆందోళనల్లో పాల్గొనబోనని హామీ పత్రాన్ని సమర్పించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. విచారణ తేదీని నవంబర్‌ 7కి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు నోటీసుపై స్టే విధించింది.


ఇటీవల జంతర్‌మంతర్‌లో సర్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొనడంతో కేంద్రం ఆయనపై కక్ష‍సాధింపు చర్యలకు దిగింది. అమెరికా పౌరుడైన ఆయన ఒసిఐ కార్డును కలిగి ఉన్నారని, ఆయన ఒసిఐ కార్డును ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఒ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే దేశాన్ని విడిచి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులను సవాలు చేస్తూ ఆయన బాంబేహైకోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్