ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢీకొన్న కారు-టాటా ఏస్.. లోయలో పడ్డ టాటా ఏస్

1 గంట క్రితం

car and tata
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 10:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి:తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, టాటా ఏస్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో కారు పల్టీలు కొట్టగా, టాటా ఏస్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజశేఖరరెడ్డి, శ్రీధర్ నాయుడులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లోయలో పడిపోయిన టాటా ఏస్‌లో ఉన్న వారి కోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్