ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

స్కూటీని ఢీకొట్టిన టిప్పర్ ఇద్దరు మృతి

1 గంట క్రితం

road acidnet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 09:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కకడే మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరదాగా క్రికెట్ ఆడేందుకు స్కూటీపై ముగ్గురు యువకులు వెళుతుండగా ఓ టిప్పర్ లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహేశ్ (17), లక్ష్మీ తేజ (17) అనే ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్