హైదరాబాద్ : సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణను సిఎం చంద్రబాబు ఆదివారం కలిశారు. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాగా, కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడం, వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మోకాలి కండరాల్లో చీలిక ఏర్పడి ఉండొచ్చని భావించిన వైద్యులు కొన్ని రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
బాలకృష్ణను పరామర్శించిన సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 11:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)