ప్రజాశక్తి-విశాఖపట్నం:గాజువాక పరిధిలోని గంగవరం నుంచి యారాడ వెళ్లే రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం ప్రాంతానికి చెందిన కార్తీక్ (17), అమ్మోరు అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు అమ్మోరుకు తీవ్ర గాయాలు కావడంతో న్యూ పోర్ట్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గంగవరం–యారాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 10:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)