బ్యాలెట్ పేపర్లను మీడియాకు చూపించిన వైసీపీ బలపరిచిన అభ్యర్థి
ప్రజాశక్తి - ముండ్లమూరు : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో బ్యాలెట్ పేపర్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ శ్రేణులు బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, వైసీపీ మద్దతుదారులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిసింది. టీడీపీ శ్రేణులను మహిళలు నిలదీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్లను స్వాధీనం చేసుకున్న వైసీపీ బలపరిచిన అభ్యర్థి వాటిని మీడియాకు చూపిస్తూ, ఈ వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంపై వైసీపీ బలపరిచిన అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.







కామెంట్‌లు (0)