హాయ్ ఫ్రెండ్స్!
ఈ రోజుల్లో ఇంటర్నెట్ మన జీవితంలో ముఖ్యమైన భాగమైంది. చదువు, సమాచారం, వినోదం కోసం చాలామంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, అనుమానాస్పద లింకులు తెరవకూడదు. మన పాస్‌వర్డ్‌లు, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, వ్యక్తిగత ఫొటోలు వంటి వివరాలను అపరిచితులతో పంచుకోకూడదు. ఆన్‌లైన్‌లో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బెదిరించినా భయపడకుండా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు చెప్పాలి. ఇతరుల ఫొటోలు, వివరాలను వారి అనుమతి లేకుండా పంచుకోకూడదు. ఇంటర్నెట్‌ను చదువుకు, విజ్ఞానానికి ఉపయోగించుకోవాలి. ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గడపకుండా జాగ్రత్తపడాలి. డిజిటల్ ప్రపంచంలో కూడా మన భద్రత మనకు ముఖ్యం. ఆన్‌లైన్‌లో ఏదైనా సందేహం కలిగితే పెద్దల సలహా తీసుకోవాలి. జాగ్రత్తగా ఉంటేనే ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉపయోగించగలం.

వి. కార్తీక్
వల్లభాపురం,
గుంటూరుజిల్లా.







కామెంట్‌లు (0)