ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత

16 నిమిషాల క్రితం

నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జల్‌జీవన్ మిషన్ పనులు నిలిపివేయాలని తెలంగాణ నేతల ఆందోళన

  • పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

ప్రజాశక్తి - మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ వద్ద జల్‌జీవన్ మిషన్ పనుల నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నాగార్జున సాగర్ వద్దకు చేరుకుని జల్‌జీవన్ మిషన్ పనులను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. విజయపురిసౌత్‌లో కొనసాగుతున్న జల్‌జీవన్ మిషన్ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ జల్‌జీవన్ మిషన్ అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకే పనులు నిర్వహిస్తున్నామని ఏపీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఇరువర్గాల మధ్య వాగ్వాదం కొనసాగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు విజయపురిసౌత్‌లోని జల్‌జీవన్ మిషన్ పనుల ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనలతో నాగార్జున సాగర్, విజయపురిసౌత్ ప్రాంతాల్లో కొంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కృష్ణా జలాల తరలింపు, జల్‌జీవన్ మిషన్ పనులపై తలెత్తిన వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్