ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మొక్కలతో మా ముచ్చట్లు.. పంట పనులతో మా సంతోషం!

32 నిమిషాల క్రితం

tree.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మా పాఠశాలలోని అరవింద వనమే మాకు చిన్న వ్యవసాయ క్షేత్రం. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు అవసరమైన పనిముట్లు తీసుకుని అక్కడికి వెళ్తాం. అందరం కలిసి పంట పనులు చేయడం మాకు ఎంతో ఇష్టం. ముందుగా కూరగాయలు, ఆకుకూరలను కోసి, బుట్టలో వేస్తాం. తర్వాత చిన్న చిన్న మడులుగా చేసి, మా చిన్న నాగలితో నేలను దున్ని, విత్తనాలు చల్లుతాం. మొక్కల మధ్య పెరిగిన కలుపును తొలగించి, జీవ ఎరువులు వేస్తాం. అప్పుడప్పుడు చెట్లకు కాసిన జామకాయలను కోసుకుని తింటాం. మొక్కలకు నీరు పెట్టడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మా పనుల్లో భాగమే. మా చేతులతో విత్తనాలు నాటినప్పుడు, అవి మొలకెత్తి మొక్కలుగా, ఆ తర్వాత పంటగా ఎదగడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రకృతిని దగ్గరగా అర్థం చేసుకోవడంతో పాటు, పర్యావరణాన్ని కాపాడటం, ఆహారం విలువ తెలుసుకోవడం, శ్రమను గౌరవించడం కూడా నేర్చుకుంటున్నాం. ఈ పనులు మాకు మంచి వ్యాయామం కూడా. మేము కోసిన ఆకుకూరలను హాస్టల్‌కు అందిస్తాం. మా బడి తోటలో పండిన పంట మా తోటి విద్యార్థులకు ఉపయోగపడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. పుస్తకాలలో చదివే వ్యవసాయ పాఠాలను ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నాం. అందుకే బడి పంట పనులు మాకు చదువుతో పాటు ఆనందాన్ని, కొత్త అనుభవాలను అందిస్తున్నాయి.

ఎం.దీక్ష_ (1).jpg



ఎం. దీక్షా

10వ తరగతి

అరవింద హైస్కూల్,

కుంచనపల్లి,

తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్