శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నూజిల్లపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ఉద్రిక్తత..

1 గంట క్రితం

amb statue
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 10:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పోలీసుల మోహరింపు

ప్రజాశక్తి-పంగులూరు(బాపట్ల): అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో బాపట్ల జిల్లా పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దళితులు శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి విగ్రహం వద్దే బైఠాయించారు. రాత్రంతా అక్కడే ఉండి తమ డిమాండ్‌ను వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. దర్శి డీఎస్పీ, అద్దంకి రూరల్ సీఐ, అద్దంకి టౌన్ సీఐలతో పాటు నలుగురు ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.శనివారం ఉదయం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో రెండు వర్గాలు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పంగులూరు మండల తహసీల్దార్ సింగారావు సర్వేయర్లను పిలిపించి విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని కొలతలు వేయిస్తున్నారు. స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. సమాచారం అందుకున్న సీపీఎం మండల కార్యదర్శి తలపనేని రామారావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దళితుల పక్షాన నిలిచి వారి డిమాండ్లకు మద్దతు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్