శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వేలేరుపాడులో విజయవంతమైన ఏజెన్సీ బంద్

1 గంట క్రితం

eluru 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేలేరుపాడు: మండలంలో వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడంతో శనివారం ఏజెన్సీ బంద్ విజయవంతమైంది. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పలు డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేలేరుపాడు నుంచి భూదేవిపేట వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించడంతో మండలంలో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి.

వేలేరుపాడు నుంచి భూదేవి పేట వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేస్తున్న నాయకులు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్