ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసింది. తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమకావడం బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీలోపు నిధులు జమకానున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా బడికెళ్తున్న ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం కింద ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండో సారి ఈ పథకాన్ని అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 67.47 లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం తేల్చి రూ.10,120.78 కోట్లను విడుదల చేసింది. మొత్తం 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమకానున్నాయి. తొలిదశలో 64.76 లక్షల మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించి 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. మిగిలిన వారికి ఆగస్టు 30న జమచేయనుంది. కాగా పిల్లలే మన సంపద అని, వారి చదువులే మనకు తరగని ఆస్తి అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యే మన రాష్ట్ర వెలకట్టలేని పెట్టుబడి అని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Print Editionతల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 12:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)