బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెల్లెట్‌‌ గన్‌, షాట్‌ బ్యాటన్ల ప్రయోగం ఎందుకు?

-131 నిమిషాల క్రితం

delhifire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిజెపి ఆందోళనలతో విస్తృత చర్చ

న్యూఢిల్లీ :ఇటీవల ఢిల్లీలో సిజెపి నిర్వహించిన పార్లమెంట్‌ ‌మార్చ్‌‌ సందర్భంగా ఆందోళనకారులపై పెల్లెట్‌ ‌గన్లు, షాక్ బ్యాటన్లు ప్రయోగించడంపై విమర్ళలు వెళ్లువెత్తుతున్నాయి. అసలు వీటిని ఉపయోగించడం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. సిజెపి పిలుపు మేరకు జరిగిన పార్లమెంట్‌ మార్చ్‌‌పై పోలీసుల క్రూరమైన దాడిలో అనేక మంది గాయపడ్డారు. వీరిలో పలువురికి పెల్లెట్ గన్ గాయాలయ్యాయి. 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరి కంటి కింద ఇరుక్కుపోయిన పెల్లెట్లను తొలగించడానికి గురుగ్రామ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇంకా చాలా పెల్లెట్లు అతని శరీర పైభాగంలో ఇరుక్కుపోయాయి. అలాగే, ఒక మహిళకు భద్రతా సిబ్బంది 'షాక్ బ్యాటన్'తో షాక్ ఇస్తున్న మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో సాధారణ నిరసనకారులపై పెల్లెట్ గన్లు, షాక్ బ్యాటన్లను ఉపయోగించడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అంటున్నారు.

gun

​పెల్లెట్ గన్స్ అంటే ఏమిటి?

సాదారణంగా ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి భాష్ప వాయువు, నీటి ఫిరంగులు, పెప్పర్ స్ప్రే, టేజర్ గన్‌లు .. వంటి ప్రాణహాని లేని పద్ధతుల్ని ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, సైన్యం ఉపయోగిస్తుంటారు. వీటిలో ఇప్పడు పెల్లెట్‌ ‌గన్‌‌లు కూడా చేరాయి. వేట, కీటక నియంత్రణలో విరివిగా ఉపయోగించే పెల్లెట్‌ ‌గన్‌‌లను కొన్ని దశాబ్ధాల నుంచి ఆందోళనలు, నిరసనల్లో ప్రయోగిస్తున్నారు. పెల్లెగ్‌ ‌గన్స్‌‌ అనేవి కదలకుండా చేయడానికి ఉద్దేశించినవి. ఇవి 500 గజాల దూరం వరకూ సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే, దగ్గర నుండి షూట్‌ ‌చేసినప్పుడు కళ్ళు వంటి సున్నితమైన భాగాలకు తగిలితే ప్రాణాంతకం కావచ్చు. ఈ పెల్లెట్లు చర్మాన్ని కూడా చీలుస్తాయి.

పెల్లెట్ గన్ కార్ట్రిడ్జ్‌లో సీసంతో చేసిన కొన్ని వందల గుళికలు ఉంటాయి. షూట్‌ ‌చేసినప్పుడు ఇవి కొన్ని వందల మీటర్ల దూరం వరకు చెల్లాచెదురవుతాయి. గుళికలు బాల్ బేరింగ్‌ల వలె లేదా క్రమరహితంగా వివిధ ఆకారాలలో ఉంటాయి. వీటిని పశ్చిమ బెంగాల్‌‌లోని ఇషాపూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు.

ఇటీవల పార్లమెంట్‌ ‌మార్చ్‌‌లో పెల్లెట్‌ ‌గన్లను ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయితే వీటిని సిఆర్‌‌పిఎఫ్‌కు చెందిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్‌) ‌ప్రయోగించి వుండవచ్చు. పెల్లెట్ గన్లు, షాక్ బ్యాటన్లు ఆర్‌ఎఎఫ్‌ ‌ ఆయుధాల్లో ఒక భాగం. ఈ ఆర్‌ఎఎఫ్‌ను పార్లమెంట్ మార్చ్‌ ‌సందర్భంగా పోలీసు సిబ్బందితో పాటు మోహరించారు. ఇది ఇప్పటికీ జంతర్ మంతర్ సమీపంలో మోహరించి ఉంది.

2010లో జమ్మూ కాశ్మీర్‌లో పెల్లెట్ గన్‌లను మొదటిసారిగా ఉపయోగించారు. కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటికి అనుమతించింది. అయితే 2016 జూలైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ మృతి తరువాత చెలరేగిన ఆందోళనలను అణిచివేయడానికి భద్రతా సిబ్బంది వీటిని ఉపయోగించడం వివావాదస్పదంగా మారింది. ఈ పెల్లెట్ గన్‌ల వల్ల కలిగిన గాయాలతో 13 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు. అనేక మంది కంటి చూపు కోల్పోయారు. దీంతో బిజెపి-పిడిపి ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ విమర్శలతో తరువాత ఏడాది నుంచి అంటే 2017 నుంచి పెల్లెట్‌ ‌గన్లతో “ప్లాస్టిక్ బుల్లెట్లు’ వినియోగించడం ప్రారంభించారు. వీటిని చంఢీగడ్‌‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (టిబిఆర్‌ఎల్‌)లో తయారు చేశారు. 2024 చారిత్రాత్మక రైతు ఉద్యమం, మణిపూర్‌ ఆందోళనల్లోనూ వీటిని ఉపయోగించారు.

షాక్ బ్యాటన్లు అంటే..?

షాక్ బ్యాటన్లను 2021 నుంచి భద్రతా సిబ్బంది ఆత్మరక్షణ, కార్యాచరణ ఉపయోగం కోసం ప్రవేశపెట్టారు. ఇవి గరిష్టంగా ఒక కేజీ బరువు, 450 మిమీ నుండి 700 మిమీ పొడవు ఉంటాయి. రీఛార్జ్ చేయగల బ్యాటరీతో పనిచేస్తాయి. పూర్తి ఛార్జ్‌ సమీయంలో వెయి షాక్‌‌లను కొట్టే సామార్థ్యంతో ఉంటాయి.

piletgun-

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్