శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

1 గంట క్రితం

thunder
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తాడేపల్లి: ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్