సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘టెట్‌’ ‌సమస్యలు పరిష్కరించాల్సిందే

04 సెప్టెంబర్, 2026

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిరాహార దీక్షలు చేపట్టిన యుటిఎఫ్‌

- ప్రారంభించిన సిఐటియు రాష్ట్రప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సర్వీస్‌ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ‌సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్‌ ‌నిరాహార దీక్షలు చేపట్టింది. విజయవాడలోని ధర్నా చౌక్‌‌లో ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇన్‌‌సర్వీస్‌ ‌ఉపాధ్యాయుల టెట్‌‌లో అర్హత నిబంధనలను సడలించాలని, ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని, ఆన్‌‌లైన్‌ ‌కాకుండా ఆఫ్‌‌లైన్‌‌లో జరపాలని కోరారు. ఈ సమస్యలపై యుటిఎఫ్‌ ‌నిర్వహించే ఆందోళనలకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఎపిజెఎసి చైర్మన్‌ ఎ విద్యాసాగర్‌ ‌దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. యుటిఎఫ్‌ ‌దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, శనివారం ముఖ్యమంత్రితో జరిగే చర్చల్లో టెట్‌‌పై ఉపాధ్యాయుల ఆందోళనను సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ‌ప్రసాద్‌ ‌మాట్లాడుతూ ఉపాధ్యాయులు కోరుతున్న మార్కుల తగ్గింపు, బోధిస్తున్న సబ్జెక్టులో పరీక్షలు వంటి మినహాయింపులపై ఎన్‌‌సిటిఇకి రాష్ట్రప్రభుత్వం ప్రాతినిధ్యం చేయాలని కోరారు. అధ్యక్షులు ఎన్‌ ‌వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయుల డిమాండ్లపై విద్యాశాఖ మంత్రి తక్షణం స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయక తప్పదని హెచ్చరించారు. దీక్షలో సంఘం సహాధ్యక్షులు కె సురేష్‌‌కుమార్‌, కోశాధికారి ఆర్‌ ‌మోహనరావు, కార్యదర్శులు ఎస్‌ ‌మురళీమోహన్‌, జివి రమణ, బి సుభాషిణి, వి శ్రీలక్ష్మి, ఎస్‌ ‌కిషోర్‌‌కుమార్‌, టివిజిజిఆర్‌ఆర్‌ ‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షకు డివైఎఫ్‌ఐ రాష్ట్రకార్యదర్శి జి రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట ఉపాధ్యక్షులు రవి, ప్రైవేట్‌ ‌టీచర్స్‌ ‌లెక్చరర్స్‌, ప్రొఫెసర్స్‌ ‌వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ‌కన్వీనర్‌ ఎం సూర్యారావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ ‌గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఎస్‌‌టిఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి ఎన్‌ అరుణకుమారి, యుటిఎఫ్‌ సహాధ్యక్షులు ఎఎన్‌ ‌కుసుమకుమారి, కార్యదర్శులు బి లక్ష్మిరాజా, ఎస్ పి మనోహర్‌‌కుమార్‌, కె శ్రీనివాసరావు, కె శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్