- తరుణీ తరంగిణీ లోగో ఆవిష్కరణ
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం నగరంలో అక్టోబర్ 4వ తేదీన దసరా సందర్బంగా జరగబోయే మహిళా సాంస్కృతికోత్సవాలకు సంబందించిన తరుణీ తరంగిణీ లోగో ఆవిష్కరణ స్థానిక ప్రెస్స్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్బంగా స్థానిక ప్రెస్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్స్ మీట్ లో గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని అయినా రాజమహేంద్రవరం నగరంలో దసరా సందర్భంగా తరుణి తరంగిణి పేరుతో మహిళా సాంస్కృతి కోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంట బయట అనేకరకాల పనులతో శతమతమవుతున్న మహిళలకు ఆటవిడుపుగాను, మానసిక ఉల్లాసాన్ని కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో అనేక రకాల అంశాల పట్ల ఆసక్తి ఉందని, ప్రతిభా పాటవాలు వున్నాయని, వాటిని ప్రదర్శించుకోవడానికి ఒక వేదికగా ఈ తరుణీ తరంగిణీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తరుణీ తరంగిణి, ఆర్ట్స్ కాలేజ్ మహిళా సాధికారత విభాగం ల సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ ఆదివారం, ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్ డాన్స్, పాటలు పాడటం, ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ, కోలాటం, మైమ్, డ్రాయింగ్, కార్టూన్ గీయటం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, వాయిద్య పరికరాలు వంటి 18 రకాల అంశాలలో పోటీలను నిర్వహిస్తామని తెలియజేశారు. ఇది పూర్తిగా మహిళల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థినిలు మహిళలు వయసుతో నిమిత్తం లేకుండా 16 సంవత్సరాలనుండి ఏ వయసు వారైనాపాల్గొనవచ్చని తెలియజేశారు. ఈ పోటీలు రెండు విభాగాలుగా జరుగుతాయని కాలేజీ విద్యార్థినులంతా జూనియర్స్ విభాగంగా, మహిళలంతా అంటే గృహిణిలు ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయిస్ ఇలాంటి వారంతా సీనియర్స్ విభాగంగాను ఈ పోటీలు జరుగుతాయని ఆమె తెలియజేశారు. పోటీలకు సంబంధించిన వివరాలతో బ్రోచర్లు కాలేజీలకు అందిస్తామని తెలియజేశారు. ఎవరు ఏ పోటీలలో పాల్గొంటారు అనేది ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. మహిళలు మేము ఇచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలియజేశారు. అలాగే ప్రతి పోటీలో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వబడతాయని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తామని కార్యక్రమం రోజు పాల్గొన్న అందరికీ మధ్యాహ్నం భోజన ఏర్పాటు కూడా అక్కడే ఉంటుందని తెలియజేశారు. పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఆర్థిక హార్దిక సహకారాలు అందించి ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఉపాధ్యాయ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ శ్రీమణి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు విజయ గౌరి, బాలోత్సవం నిర్వాహకులు నవీన, సుజాత విల్సన్, ఝాన్సీ, అంజలి, లక్ష్మి, స్వేచ్ఛ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)