ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

18న నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల

1 గంట క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 10:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల: నవంబర్‌లో శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవల టికెట్ల కోటాను టిటిడి ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన యాత్రికులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లించాలి. 21న కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్‌ సేవలు, దర్శన స్లాట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. 24న అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను విడతలవారీగా విడుదల చేస్తారు. 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. యాత్రికులు టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని టిటిడి సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్