ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గొడ్డలితో అన్నను నరికి చంపిన తమ్ముడు

1 గంట క్రితం

HATYA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బ్రహ్మంగారిమఠం(కడప): బ్రహ్మంగారిమఠం మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆదివారం దారుణ హత్య చోటుచేసుకుంది. మద్యం సేవించిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఘటనలో తమ్ముడు గొడ్డలితో అన్నను హతమార్చాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వజ్రాల సుబ్బరాయుడు, హైమావతి దంపతుల పెద్ద కుమారుడు వజ్రాల వెంకటసుబ్బయ్య (45), చిన్న కుమారుడు వజ్రాల సురేష్‌ మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకంది. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న వెంకటసుబ్బయ్యపై సురేష్‌ గొడ్డలితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివప్రసాద్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్