ప్రజాశక్తి-కాకినాడ: కాకినాడ జిల్లాలోని పరదేశమ్మపేటలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాకినాడ వన్‌టౌన్ సీఐ ఎం. నాగదుర్గారావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో సరైన రికార్డులు లేని 30 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతంలోని రౌడీషీటర్లు, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించి సక్రమమైన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసైతే కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈగల్ టీమ్ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాలను అక్రమంగా కలిగి ఉన్నా, విక్రయించినా, సరఫరా చేసినా వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోర్ట్ సీఐ పి. సునీల్‌కుమార్, సర్పవరం సీఐ సి.హెచ్. ప్రకాష్, 3 టౌన్ సీఐ కె.వి.ఎస్. సత్యనారాయణ, ఎస్‌ఐలు, ఈగల్ టీమ్ అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
పరదేశమ్మపేటలో కార్డెన్ అండ్ సెర్చ్.. 30 మోటార్ సైకిళ్లు స్వాధీనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)