తిరుపతి : పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. నర్సింగరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు రాష్ట్ర నాయకత్వం తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించి రోగులు, కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంది. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ .... ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికీ నర్సింగ్ సిబ్బంది, హౌస్‌కీపింగ్ కార్మికుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో పని భారం పెరిగిందని తెలిపారు. ఈఎస్ఐ డిస్పెన్సరీకి ప్రతిరోజూ వందలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్నప్పటికీ తగిన మందులు, సిబ్బంది లేకపోవడం ఆందోళనకరమన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, హౌస్‌కీపింగ్ కార్మికులకు న్యాయమైన వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ పథకాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు.
తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి : సిఐటియు
29 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)