మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలాఠీఛార్జిపై నేడు గవర్నర్‌ వద్దకు ..

46 నిమిషాల క్రితం

2059099-ys-jagan.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వైసిపి అధినేత జగన్‌‌మోహన్‌‌రెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌‌సి నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేసిన ఘటనను గవర్నర్‌‌ను కలిసి వివరిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్‌‌రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ ‌నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి (బుధవారం) సాయంత్రం గవర్నర్‌‌ను కలవనున్నట్లు చెప్పారు. డిఎస్‌‌సి స్పోర్ట్స్‌ ‌కోటా విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడిచేయడంతోపాటు కేసులు నమోదు చేశారని, పోలీసుల వద్ద టిడిపి కార్యకర్తలు లాఠీలు లాక్కుని మరీ కొట్టారని, వికలాంగులనే కనికరం కూడా చూపలేదని అన్నారు. దాడిచేయడానికి వచ్చిన వారిని పోలీసులు స్వేచ్ఛగా వదిలేశారని చెప్పారు. దాడికి చంద్రబాబు, లోకేష్‌లు వేసిన పథకానికి కొంతమంది పోలీసులు కొమ్ముకాశారని అన్నారు. దీన్ని సీరియస్‌‌గా తీసుకుంటామని చెప్పారు. అక్రమాలపై సిబిఐ విచారణకు డిమాండ్‌ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని, స్కామ్‌లను బయటపెడుతుంటే దాడులు చేస్తున్నారని వివరించారు. వైసిపి చేసిన ర్యాలీతో డిఎస్‌‌సి స్కామ్‌పై మరోసారి చర్చ జరిగిందని, దీన్ని డైవర్ట్‌ చేయడానికి గూండాలను దింపారని అన్నారు. గతంలో లోకేష్‌ ‌యువగళంలో పనిచేసిన వారిని తీసుకొచ్చి కొట్టించారని, వారిని పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. దాడులు చేయించి భయపెట్టి, బెదిరించాలని చూస్తున్నారని, దీనికి పోలీసులు పూర్తిగా కొమ్ముకాస్తున్నారని చెప్పారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలో రౌడీదళంతో అలజడికి కుట్ర చేశారన్నారు. కుప్పంలో చంద్రబాబు చేసిన ప్రకటన, బెదిరింపులే దీనికి సాక్ష్యమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి రౌడీదళాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అవినీతి, స్కామ్‌లపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్లని రంగంలోకి దించుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను జంగిల్‌రాజ్‌ కన్నా ఘోరంగా తయారు చేశారని, గాయాల పాలైనప్పటికీ వైసిపి నాయకులు సంయమనం పాటించారని తెలిపారు. అయినా వైసిపి నాయకులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. గతంలో వైయస్సార్‌సిపి మీద చేసిన అనేక దాడుల్లో ఈ రౌడీదళం ఉందని, కళ్లముందు సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని వివరించారు. తలలు పగులకొట్టినవారిపై కాకుండా కొట్టించుకున్నవారిపైనే కేసులు నమోదు చేసిన ఘనత విజయవాడ పోలీసులదేనని విమర్శించారు. ముఖ్యమంత్రి ఒత్తిళ్లతో పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. దాడి చేసినవారిపైనా, వారిని ఉసిగొల్పిన వారిపైనా కేసులు పెట్టాలన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడి డిఎస్‌‌సి పోరాటం ఆగదని పేర్కొన్నారు. నిజాయితీ పరులైన అభ్యర్థులకు వైసిపి అండగా ఉంటుందని, డిఎస్‌‌సి వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించే వరకూ విశ్రమించేది లేదని తెలిపారు.

నేడు గవర్నర్‌ ‌వద్దకు

డిఎస్‌‌సి విషయంలో జరిగిన దాడిపై గవర్నర్‌‌కు వివరించేందుకు బుధవారం మాజీ సిఎం జగన్‌ ‌గవర్నర్‌‌ను కలవనున్నట్లు వైసిపి కేంద్ర కార్యాలయం తెలిపింది. వికలాంగులను కూడా కొట్టారని, తీవ్ర గాయాల పాలయ్యాయని అన్నారు. వారిపై చర్యలు తీసుకోకుండా, కొడుతున్న టిడిపి వారికి మద్దతు ఇస్తూ రక్షణ కల్పించడంతోపాటు కొట్టేందుకు లాఠీలను అందించారని, వికలాంగుల వద్ద కర్రలు లాక్కుని మరీ కొట్టినా పోలీసులు చోద్యం చూశారని అన్నారు. ఎదురు తిరిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారని వివరించారు. ఈ విషయాలన్నిటినీ గవర్నర్‌‌కు వివరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే డిఎస్‌‌సిపై సిబిఐ విచారణ కూడా కోరనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్