శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేపు మోస్తరు వర్షాలు...

1 గంట క్రితం

Another Low-Pressure Area – Rains Return to Telugu States
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 08:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్‌‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌ ‌జైన్‌ ‌శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా రేణిగుంటలో 85.7మిల్లీ మీటర్లు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 81.9 మిల్లీ మీటర్లు, అన్నమయ్య జిల్లా మదనపల్లె 59.5 మిల్లీ మీటర్లు, బాపట్ల జిల్లా ఇడుపులపాడులో 57.9 మిల్లీ మీటర్లు, తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో 54.7 మిల్లీ మీటర్లు, తిరుపతి అర్బన్ లో 46.6 మిల్లీ మీటర్లు, కడప జిల్లా వీరపునాయునిపల్లెలో 45.8 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా పలమనేరులో 44 మిల్లీ మీటర్లు, కొత్తకోటలో 41.8 మిల్లీ మీటర్లు, కోనసీమ జిల్లా మామిడికుదురులో 41.5 మిల్లీ మీటర్లు వర్షపాతం రికార్డైందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్