ప్రజాశక్తి- తాడేపల్లి : ఉండవల్లి కరకట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరణించాడు.
శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామానికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోతిరెడ్డి మురళీ (24) విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మురళీ ప్రస్తుతం తన ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. తన స్నేహితుడి సోదరికి విజయవాడ లో నీట్ పరీక్ష ఉండటంతో స్నేహితుడు, స్నేహతుడి సోదరితో కలిసి మురళీ విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఉండవల్లి కరకట్టలోని ఎత్తిపోతల పథకం వద్ద సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా మురళీ మృతదేహం లభ్యమైంది. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మురళీ అకాల మరణంతో లావేరు గ్రామంలో విషాదం నెలకొంది.








కామెంట్‌లు (0)