ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన సమస్యలు పరిష్కరించాలి

1 గంట క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 01:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేడు ‘చలో కలెక్టరేట్’

- విజయవంతం చేయాలని ప్రజాసంఘాల పిలుపు

ప్రజాశక్తి- యంత్రాంగం : గిరిజన వాడల్లో కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావంలో భాగంగా పలు జిల్లాల్లో ఆదివారం దళిత గ్రామాల్లో నాయకులు పర్యటించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్వహించే చలో కలెక్టరేట్‌‌ను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో సర్వే చేశామని వారు తెలిపారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 24వ డివిజన్, ఆర్‌‌డిటి కాలనీలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రెహనా బేగం, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, కెవిపిఎస్ రూరల్ కార్యదర్శి ఎన్ మాలకొండయ్య మాట్లాడుతూ సోమవారం విఆర్సి గ్రౌండ్ నుండి జరిగే ర్యాలీలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆర్‌‌డిటి కాలనీలో ఎస్‌‌టి, ఎస్‌‌సి సబ్ ప్లాన్ ద్వారా నిధులు ఖర్చుపెట్టి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జరిగే ధర్నా జయప్రదం కోసం ప్రచారం నిర్వహించారు. ప్రచారాన్ని కౌలురైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు ప్రారంభించి మాట్లాడారు.

విజయనగరం ఎల్‌‌బిజి భవనం నుంచి కోట జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కెవిపిఎస్‌ ‌జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు సిఫారసులు, పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, ఎస్‌‌సి, ఎస్‌‌టి సబ్ ప్లాన్ చట్టం అమలు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. ఎస్‌‌సి, ఎస్‌‌టి అట్రాసిటీ చట్టంలోని లొసుగులు వల్ల దళితులు, గిరిజనులపై జిల్లాలో దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ జివిఎంసి ఒకటో వార్డు సంతపేట దళిత కాలనీలో ప్రజాసంఘాల నాయకులు పర్యటించారు. స్థానిక సమస్యలనడిగి తెలుసుకున్నారు. చలో కలెక్టరేట్‌ ‌కార్యక్రమం పోస్టర్‌‌ను కొమ్మాది కూడలిలోని సిఐటియు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. జివిఎంసి నాలుగో వార్డు పరిధి సోమన్నపాలెం, నేరెళ్లవలస ఎస్‌‌సి కాలనీ ప్రాంతాల్లో సిఐటియు, కెవిపిఎస్ నాయకులు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్