తిరుమల: టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1 కోటి 11 లక్షల భారీ విరాళం అందింది. హైదరాబాద్ బంజారా హిల్స్‌కు చెందిన కుంచాల మధురాం రెడ్డి సోమవారం హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోసంరక్షణ కార్యక్రమానికి భారీగా విరాళం అందించి దాతృత్వాన్ని చాటుకున్న మధురాం రెడ్డిని చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. గోవుల సంరక్షణ, వాటి సంక్షేమం కోసం దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ఆయన పేర్కొన్నారు.
టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల విరాళం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 06:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)