- విద్యుద్ఘాతంతో ఇద్దరు యువకులు దుర్మరణం
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామి తిరునాళ్ల సందర్భంగా బ్యానర్ ఏర్పాటు చేస్తున్న ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం... శుక్రవారం తిరునాళ్ల సందర్భంగా పుత్తూరు ఎస్‌బిఐ కాలనీకి చెందిన ఏళ్ల గోకుల్ (18), కల్యాణ పురానికి చెందిన ఏళ్ల విగ్నేష్ (19) కార్వేటినగరం వెళ్లే దారిలో బ్యానర్ కట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సమీపాన విద్యుత్ తీగలను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరూ స్నేహితులు. వీరి మృతితో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.








కామెంట్‌లు (0)