ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజెన్ జీ ఉద్యమతీరు అభినందనీయం

1 గంట క్రితం

zng
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 11:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ‘బద్దలైన నిశ్శబ్దం’ పుస్తకావిష్కరణలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం

ప్రజాశక్తి - నెల్లూరు : ​ప్రస్తుత జెన్ జీ తరం దేశంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తూ, తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న తీరు అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త విఠపు బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ‘బద్దలైన నిశ్శబ్దం’ పుస్తకావిష్కరణ సభ యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తూ, తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న జెన్ జీ తరం తీరు అభినందనీయమన్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఉద్యమం, కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చిన ఉద్యమ స్ఫూర్తి వంటి అంశాలపై ఈ తరం యువత విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల సమస్యలు, ప్రాథమిక విద్య అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పరిస్థితులను పరిశీలించాలని కోరారు. తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించే దృక్పథాన్ని యువత పెంపొందించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలు, విద్యా హక్కు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి.చలపతి శర్మ, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషు, యుటిఎఫ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్