గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్టయిఫండ్‌ పెంచలేం..

1 గంట క్రితం

satyakumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 12:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జూనియర్‌ డాక్టర్లతో మంత్రి సత్యకుమార్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జూనియర్‌ ‌డాక్టర్లకు స్టయిఫండ్‌ పెంచలేమని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌ చెప్పారు. జూడా ప్రతినిధులతో అసెంబ్లీలో ప్రాంగణంలో గురువారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా స్టయిఫండ్‌‌ను 15శాతం పెంచలేకపోతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 5శాతం, వచ్చే ఏడాది 3శాతం చొప్పున పెంచుతామని తెలిపారు. పిజి, సూపర్‌ ‌స్పెషాల్టీ పిజిలకు ఏటా 3 శాతం పెంచుతామని తెలిపారు. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలు నేపధ్యంలో స్టయిఫండ్‌ 15‌శాతం పెంచాలని జూనియర్‌ డాక్టర్లు కోరారు. ఈ సమావేశంలో జూనియర్‌ ‌డాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు ఈశ్వర శంకర్, ఉపాధ్యక్షుడు జి. భార్గవసాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్