- క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాం
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
*అమరావతి: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులను, పంటలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథంతో సమగ్ర కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంటే.. వాస్తవాలను పక్కనపెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏమీ చేయలేదని జగన్ చెప్పడం పూర్తిగా అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 2026లోనే ‘జలధార’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారని తెలిపారు. ముందస్తు ప్రణాళికలు, క్షేత్రస్థాయి చర్యల ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరిగాయని వెల్లడించారు. ‘జలధార–జలహారతి’ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రూ.3,409.35 కోట్ల వ్యయంతో 79,826 పనులను పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 625 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముందస్తు చర్యలు లేకపోయి ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేదని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)