- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాదకద్రవ్యాలపై పోరాటం అంటే యువత కలలు, వారి ఆరోగ్యం, వారి భవిష్యత్తును కాపాడే పోరాటమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సమాజం మొత్తం మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానంతో కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడమే కాకుండా, వ్యసనంతో బాధపడుతున్న వారికి గౌరవప్రదమైన పునరావాసం, వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒకప్పుడు రాష్ట్రంలో డ్రగ్స్‌కు అవకాశం కల్పించిన పరిస్థితులకు ముగింపు పలికామన్నారు. నేడు రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్, వ్యసన బాధితుల పునరావాసానికి పూర్తి మద్దతు, ప్రతి కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.








కామెంట్‌లు (0)