గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పొడిగింపు

3 గంటల క్రితం

wines
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎక్సైజ్‌ ‌శాఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2026–27 ఎక్సైజ్ పాలసీ ప్రకారం 807 ఏ4 మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు పొడిగించినట్లు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారికి అదనపు అవకాశం కల్పిస్తూ ఈ నెల 6 అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎక్సైజ్‌ ‌శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7న దరఖాస్తుల పరిశీలన చేపట్టి, అర్హత కలిగిన దుకాణాలకు 8న డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించి లైసెన్సులు కేటాయించ నున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తాజా కేటాయింపుల కోసం గుర్తించిన 807 ఏ4 దుకాణాల్లో 799 ఓపెన్ కేటగిరీ, 8 రిజర్వుడ్ కేటగిరీ దుకాణాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు, రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందన్నారు. ఎ 4 మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అర్హత కలిగిన దరఖాస్తుదారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఆన్‌లైన్, హైబ్రిడ్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్