- నేడు మోడీతో భేటీ
న్యూఢిల్లీ : రెండు రోజుల అధికారిక పర్యటన కోసం నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఆదివారం మధ్యాహ్నం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఆయనకు స్వాగతం పలికారు. నేపాల్ ఎయిర్‌లైన్స్ నడిపే సాధారణ వాణిజ్య విమానంలో ఈ పర్యటనకు బాలేంద్ర షా రావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత షాకు ఇది మొదటి అధికారిక ద్వైపాక్షిక విదేశీ పర్యటన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు షా వచ్చారు. బాలేంద్రషాతోపాటు ఆయన ముఖ్య సలహాదారు కుమార్ బ్యంజంకర్, నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్‌లతో కూడిన 34 మంది సభ్యుల ప్రతినిధి బృందం, ఒక ప్రత్యేక వ్యాపార ప్రతినిధి బృందం ఈ పర్యటనకు వచ్చింది. ఆదివారం సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో షా భేటీకానున్నారు. రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మహాత్మా గాంధీకి షా నివాళులర్పిస్తారు.
ఇరు దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ప్రకృతి వైపరీత్యాలు - వాతావరణ మార్పు వంటి సమస్యలను పరిష్కరించడం.. మొదలై అంశాలపై కూడా ఈ పర్యటనలో చర్చలు జరగనున్నాయి.







కామెంట్‌లు (0)