ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటమిని ఒప్పుకోలేక వీధి లైట్లు తొలగింపు

28 నిమిషాల క్రితం

ఓటమిని ఒప్పుకోలేక
వీధి లైట్లు తొలగింపు
: రాజస్తాన్‌‌లో బిజెపి నేత నిర్వాకం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

: రాజస్తాన్‌‌లో బిజెపి నేత నిర్వాకం

జైపూర్‌ : స్థానిక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఒక బిజెపి నాయకుడు తన అనుచరులతో వీధి లైట్లు తొలగించాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు జిల్లాలోని పలు గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలకు సుమారు 50 ఎల్‌ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేశారు.

నివాయి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ సహాయ్ వర్మ వీటిని ఏర్పాటు చేయించారని బిజెపి నాయకులు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. ఎమ్మెల్యే వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసే అలోక్ శర్మ భార్య ప్రియాంక శర్మ పంచాయతీ సమితి సభ్యురాలిగా పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. దీంతో అలోక్ శర్మ తన అనుచరులతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను తొలగించాడు. స్థానికులు ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణ జరిపేందుకు విద్యుత్ శాఖ ఓ ఉన్నతాధికారిని నియమించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్