ప్రజాశక్తి-పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తమ్మిశెట్టి సుజాత (35)పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.
సుజాతపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దేవళ్ల పార్వతమ్మపైనా నిందితుడు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.







కామెంట్‌లు (0)