ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్న వైసిపి

1 గంట క్రితం

varla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 07:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి నాయకులు శాంతిభద్రతల సమస్యను సృష్టించి ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు కుట్ర పన్ని హింసను కొనసాగిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌‌ను టిడిపి కోరింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పి అశోక్‌ ‌బాబు ఆదివారం కలిసి ఫిర్యాదు చేశారు. మార్కాపురం జిల్లా దర్శి, కడప జిల్లాలోని పులివెందులలో ప్రైవేట్‌ ‌కార్లకు నిప్పుపెట్టి భయానకం వాతావరణం సృష్టించారని, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. దర్శి ఎమ్మెల్యే బి శివప్రసాద్‌ ‌రెడ్డి, కడప ఎంపి అవినాష్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు మోడల్‌ ‌కోడ్‌ను పూర్తి ఉల్లంఘించారని, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్