mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం

10 జూన్, 2026

dyfi protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 09:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం విడకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని అవసరమయితే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న హెచ్చరించారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నాచౌక్ లో బుధవారం నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది.రాష్ట్ర కమిటీ సభ్యులు పి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామన్న మాట్లాడుతూ గతేడాది ఏప్రిల్ లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం 2260 పోస్టులకు మంత్రివర్గ సమావేశంలో అమెదం తెలిపిందని చెప్పారు. సిలబస్ కూడా ఇచ్చారని నోటిఫికేషన్ మాత్రం మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా రెగ్యులర్ నోటిఫికేషన్ లేదని, దీంతో వయస్సు దాటిందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి డీఎస్సీలో ఒక జిల్లాకు ఓకే పేపర్ ఉండాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఉద్యోగాల పేరుతో విదేశీ పర్యటనలు చేస్తున్నారే తప్ప యువతకు ఉద్యోగాలు మాత్రం రావడం లేదని తెలిపారు. రెండేళ్లులో 4,71,574 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చేబుతుంటే, యువజన శాఖ మంత్రి ఏకంగా 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పడం అన్యాయం అని విమర్శించారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి కల్పన పేరుతో భూ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్ల కాలంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవి రమణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కసాపురం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హమీ ఎమైందని ప్రశ్నించారు. డిఎస్సి పేరుతో కొన్ని జిల్లాలపై వివక్ష చూపోద్దన్నారు. కెవిపిఎస్ ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి నారాయణ, సోమశేఖర శివ, నర్సింహ, సురేంద్ర, ఇజ్రాయెల్, కృష్ణ, లోకేష్, మధు, శీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్